Advertisement
Google Ads BL

క్రికెటర్ తో పెళ్లి-రియాక్ట్ అయిన తమన్నా


కొద్దిరోజుల క్రితమే తమన్నా భాటియా నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ చెయ్యడమే కాదు ఆమె పెళ్లి కూడా చేసుకోబోతుంది అనే వార్త వినిపించిన తరుణంలో తమన్నా-విజయ్ వర్మ ప్రేమ బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ వర్మ, తమన్నా ఎవరి షూటింగ్స్ లో వారు బిజీ అయ్యారు. అయితే తమన్నా పై మరో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Advertisement
CJ Advs

తమన్నా పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్ర‌చారం స్టార్ట్ అయ్యింది. అయితే తన విషయంలో మీడియా జోక్యం సహించని తమన్నా అబ్దుల్ రజాక్‌ తో పెళ్లి రూమర్స్ పై రియాక్ట్ అయ్యింది. అసలు ఇలాంటి గాసిప్స్‌ ఎలా పుట్టుకొస్తాయో తెలియదు. ఎప్పుడో ఒకసారి జ్యువెల్లరీ షాపు ఓపెనింగ్ కోసం అబ్దుల్ రజాక్‌తో కలిసి వెళ్లాను. 

అది జస్ట్ ప్రొఫెషనల్ మాత్రమే, అంతేకాని మా మద్యన ఎలాంటి ప్రేమ లేదు, పెళ్లి చేసుకునేంత చనువు లేదు, పబ్లిక్ ఈవెంట్‌లో కలిసి కనిపించినంత మాత్రాన‌ పెళ్లి రూమర్స్‌ రావడం ఆశ్చర్యంగా ఉంది అంటూ తమన్నా తన పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. 

Tamannaah finally reacts to marriage rumours with Abdul Razzaq:

Tamannaah found rumours linking her to Abdul Razzaq
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs