అక్కినేని నాగార్జున పెద్ద కోడలు, నాగ చైతన్య భార్య శోభిత దూళిపాళ్ల సోషల్ మీడియా షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. మోడల్, హీరోయిన్ అయిన శోభిత దూళిపాళ్ల ప్రస్తుతం హిందీలో నటిస్తూ బిజీగా ఉండడమే కాదు భీమా జ్యువెలర్ యాడ్ లోను నగలతో మెరిసింది.
రీసెంట్ గానే భార్య శోభిత తో కలిసి గడపడం పై నాగ చైతన్య మాట్లాడాడు. షూటింగ్స్ వలన తను హైదరాబాద్ లో, శోభిత ముంబై లో ఉంటున్నాం. కానీ కలిసి గడిపే క్షణాలను అద్భుతంగా మార్చేందుకు మేము ప్లాన్స్ చేసుకుంటున్నాం అని, తనకు రేసింగ్ ఓ థెరపీ లా పని చేస్తుంది అని చెప్పిన చైతు శోభితకు రేసింగ్ ట్రాక్ పై కారు నేర్పించిట్టుగా చెప్పుకొచ్చాడు.
ఇక సోషల్ మీడియాలో శోభిత వదిలే లుక్స్ చూసి ఆమె అభిమానులు సర్ ప్రైజ్ అవుతూ ఉంటారు. తాజాగా శోభిత నుంచి వచ్చిన లుక్ చూస్తే ట్రెండీ శోభిత అంటూ కామెంట్ చేసేదిలా ఉంది. ఇక శోభిత కెరీర్ పరంగా మాత్రమే గ్లామర్ షో చేస్తుంది. పూజలు, పండగలు వచ్చాయంటే చాలా సాంప్రదాయంగా పద్దతిగా చీరకట్టులో కనిపిస్తుంది.