`సయ్యారా` చిత్రంతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారింది అనీత్ పద్దా. ఈ బ్యూటీ గురించి దేశవ్యాప్తంగా యూత్ చర్చించుకుంటోంది. ఒక కొత్తమ్మాయికి ఇలాంటి అదృష్టం దక్కడం అంత సులువు కాదు. అహాన్ పాండే- అనీత్ జంటగా నటించిన సయ్యారా ఇప్పటికే 300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందని ట్రేడ్ చెబుతోంది. ఇది డెబ్యూ నటులతో నిజంగా సంచలనం. ఇంత గొప్ప సినిమాని అందించిన క్రెడిట్ పూర్తిగా దర్శకుడు మోహిత్ సూరి- యష్ రాజ్ ఫిలింస్‌కే చెందుతుంది.
మరోవైపు అనీత్ పద్దా తన డెబ్యూ సినిమా అద్బుత విజయానికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. తాజాగా అనీత్ తన లింక్‌డ్ ఇన్ ప్రొఫైల్ లో జాబ్, గోల్స్ గురించి అప్ డేట్ చేయగా, దాని స్క్రీన్ షాట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. లింక్‌డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. అనీత్ పద్దా హెచ్.ఆర్ మేనేజర్ గా ఉద్యోగాలు రిక్రూట్ చేస్తానని చెప్పింది. మానవవనరులను సద్వినియోగం చేసేందుకు ఉత్పాదక శక్తిని పెంచేందుకు సహకరిస్తానని పేర్కొంది.
పొలిటికల్ సైన్స్ ఆంగ్లంలో స్టడీస్ ని కొనసాగిస్తున్నానని , జీసస్ అండ్ సెయిట్ కాలేజ్ లో బిఏ పొలిటికల్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్నానని కూడా అనీత్ పద్దా వెల్లడించింది. విద్యతో పరిపూర్ణత సాధిస్తూనే, సినీరంగంలో సమాంతరంగా ప్రయత్నిస్తున్నానని అనీత్ పద్దా లింక్ డ్ ఇన్ లా ప్రస్థావించింది. నటనా రంగంలో మరో మూడేళ్ల పాటు జాగ్రత్తగా ప్రయత్నించాలని సహచరులు సూచించారు.