హీరోలైనా, హీరోయిన్స్ అయినా చాలామంది క్రేజ్ ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టేసుకోవాలనే ఆలోచనతో రకరకాల వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చెయ్యడమో, లేదంటే కొత్త బిజినెస్ లు స్టార్ట్ చెయ్యడమో అనేది చూస్తుంటాము. రీసెంట్ గా రష్మిక మందన్న పెర్ఫ్యూమ్ బ్రాండ్ ని స్టార్ట్ చేసింది. అంతకుముందే సమంత వస్త్ర వ్యాపారం, రకుల్ ప్రీత్ జిమ్ వ్యాపారాలు మొదలు పెట్టినవాళ్ళే.
మిల్కి బ్యూటీ తమన్నా గతంలో వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యూవెలరీ బ్రాండ్‌ను స్టార్ట్ చేసి దానిని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతుంది. అంతేకాకుండా తండ్రి సపోర్టుతో తమన్నా షుగర్ కాస్మోటిక్స్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టింది. తమన్నా ఇప్పుడు మరో వ్యాపారాన్ని స్టార్ట్ చెయ్యబోతున్నట్టుగా హింట్ ఇచ్చింది.
తాజాగా తమన్నా కార్పోరేట్లు ధరించే సూట్‌లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న వీడియో ని పోస్ట్ చేసింది. ఈ పోస్టులో మై ఫౌండర్ ఫేస్ అని రాసింది. మరి ఇదంతా ఆమె కొత్త వ్యాపారం ప్రమోషన్స్ కోసమే, ఆమె త్వరలోనే మరో కొత్త బిజినెస్ ప్రారంభించినట్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.