ఒకే ఒక్క పాట సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం చేసింది. అదే పవన్ కళ్యాణ్ OG . హరి హర వీరమల్లు డిజాస్టర్ తర్వాత పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. పవన్ ఫ్యాన్స్ మూడ్ సరిచేసేందుకు OG నుంచి సాంగ్ వదులుతున్నారా అనుకుంటున్న సమయంలో OG నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఇప్పటి వరకు OG పై ఉన్న అంచనాలను డబుల్ చేసేసింది.
ఛానళ్ల తర్వాత పవన్ చేస్తున్న స్ట్రయిట్ సినిమా OG పై పవన్ ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఉందొ పవన్ ఎక్కడ కనిపించినా అభిమానులు OG OG అంటూ అరిచే అరుపులు చూస్తే అర్ధమవుతుంది. దర్శకుడు సుజిత్ పాన్ ఇండియా మూవీగా OG ని తెరకెక్కించడమే కాదు, అందుకు గల స్టోరీని రెడీ చేసుకుని పవన్ ని గంభీర గా గ్యాంగ్ స్టర్ గా చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ గన్ తీసుకుని చీతాలా నడిచొస్తుంటే ఫ్యాన్స్ కి పూనకాతోస్తున్నాయి. నిన్న వదిలిన ఫైర్ స్ట్రోమ్ పాటే ఇంతిలా ట్రెండ్ అవుతుంటే.. ఇకపై OG నుంచి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ని ఊహించుకుని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మరి సినిమా విడుదల సమయానికి ఆ అంచనాలు ఎంతగా మారిపోతాయో చూడాలి.