అతడు నటుడిగా సుపరిచితుడు కానీ సంగీత గురువు అనే విషయం అంతగా తెలీదు. అతడి పేరు మదన్ బాబ్. మదన్ బోబ్ అని కూడా పరిశ్రమలో పిలుస్తారు. తాజా సమాచారం మేరకు నటుడు మదన్ బాబ్ క్యాన్సర్ కి చికిత్స పొందుతూ మృతి చెందారు. మధన్ బాబ్ మరణించారని ఆయన కుమారుడు అర్చిత్ ధృవీకరించారు. ఎస్ కృష్ణమూర్తిగా జన్మించి వృత్తిపరంగా మధన్ బాబ్ అని పిలుపందుకున్న ఇతడు విలక్షణమైన హాస్య శైలికి, చుట్టూ నవ్వులు పూయించే ట్రేడ్‌మార్క్ నవ్వుతో పాపులరయ్యారు.
మదన్ బాబ్ 600 కి పైగా చిత్రాలలో నటించారు, వాటిలో ఎక్కువగా తమిళ చిత్రాలు ఉన్నాయి. కె బాలచందర్ దర్శకత్వం వహించిన వానమే ఎల్లై (1992)లో ఆయన తొలిసారిగా నటించారు. తెనాలి (2000)లో డైమండ్ బాబు , ఫ్రెండ్స్ (2000)లో మేనేజర్ సుందరేశన్ పాత్రలతో మెప్పించారు. తేవర్ మగన్ (1992), సతీ లీలావతి (1995), చంద్రముఖి (2005), ఎథిర్ నీచల్ (2013) వంటి చిత్రాల్లో నటించాడు. చాచి 420 (1997) , బంగారం (2006) .. మలయాళంలో భ్రమరం (2009), సెల్యులాయిడ్ (2013) చిత్రాలలో నటించాడు.
నటనతో పాటు, అతను సంగీతదర్శకుడిగాను కొనసాగారు. ఎస్ రామనాథన్, వినాయకరామ్, హరిహర శర్మ వంటి వారి వద్ద పాశ్చాత్య శాస్త్రీయ, కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందాడు. అతడు ఏఆర్ రెహమాన్‌కు సంగీత గురువుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.