చాలామంది దర్శకులు మూడు గంటల్లో చూపించాల్సిన సినిమాని రెండు భాగాలంటూ సాగదీయ్యడం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రాన్ని తీసుకోండి.. సింపుల్ గా ఫినిష్ అవ్వాల్సిన మూవీ ని రెండు పార్టులు అన్నారు. దేవర మొదటి పార్ట్ నే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆడించారు. రెండో పార్ట్ పై ఎలాంటి అంచనాలుంటాయో అనేది ఆలోచించాలి. అసలు దేవర పార్ట్ 2 ఉంటుందా, ఉండదా అనే డైలమా కూడా ఉంది.
ఇక ఇప్పుడు దేవర మాదిరే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కూడా ఉంది. ఈ గురువారం విడుదలైన కింగ్ డమ్ చిత్రం పార్ట్ 2 ఉంటుంది అని అనౌన్స్ చెయ్యలేదు, జస్ట్ కింగ్ డమ్ పార్ట్ 2 ఉంటుంది అనే లీడ్ సెకండ్ హాఫ్ లో ఇచ్చారు. సెకండ్ పార్ట్ అక్కర్లేకుండా సెకండ్ హాఫ్ ని సరిగ్గా తెరకెక్కిస్తే సరిపోయేది.
గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ ఫిస్ట్ హాఫ్ ని పర్ఫెక్ట్ గా చూపించారు, కానీ సెకండ్ హాఫ్ ని పార్ట్ 2 కోసం కన్ఫ్యూజన్ లో పడేసారు. స్టోరీ స్ట్రయిట్ గా సాగుతున్న సమయంలో మధ్యలో ఆపడం, అనేక విషయాలను రెండో భాగంలో చూడాలన్నట్లు సెకండ్ హాఫ్ ని తీసిన విధానానికి ఆడియన్స్ నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది.
మరి పార్ట్ 2 కోసం సెకండ్ హాఫ్ ని సాగదీశారు. కథ మొత్తాన్ని కింగ్ డమ్ పార్ట్ వన్ లోనే చూపించేస్తే సరిపోయేది. కానీ పార్ట్ 2కోసం ఆపేసారు. మరి పార్ట్ 2 అనేది అవసరమా అనే మాట ఇప్పుడు ఆడియన్స్ నుంచే వినబడుతుంది. కింగ్ డమ్ పార్ట్ 2 విషయంలో ఈ సినిమా కలెక్షన్స్ డిసైడ్ చేస్తుంది అనేది వాస్తవం.