పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కావల్సింది వీరమల్లు కాదు OG అనేది ఇప్పటికైనా అర్హమైందా. హరి హర వీరమల్లు వచ్చింది నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ సినిమా మూడ్ నుంచి కోలుకునేలా OG మేకర్స్ ఇచ్చిన సర్ ప్రైజ్ ప్లాన్ చేసారు. సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్న OG నుంచి మొదటిసారి కిక్ ఇచ్చే కంటెంట్ వదిలారు.
పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలనుకున్నారో, ఆయనకు ఎలాంటి సినిమా పడాలని ఫ్యాన్స్ కోరుకున్నారో అంతకుముంచి అనేలా దర్శకుడు సుజిత్ OG ని తెరకెక్కించాడని OG ఫైర్ స్ట్రోమ్ వీడియో చూస్తే తెలుస్తుంది. తెలుగు, ఇంగ్లీష్, జపనీస్ ఇలా త్రీ లాంగ్వేజెస్ తో ఈ సాంగ్ ని డిజైన్ చేసిన తీరు, పవన్ కళ్యాణ్ లుక్, సాంగ్ మేకింగ్ విజువల్స్ అన్ని పవన్ అభిమానుల ఆకలిని తీర్చేసింది.
పవన్ కళ్యాణ్ గంభీర లుక్ చూసుకుని అభిమానులు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ రేంజ్ లో పవన్ ని చూసి ఎన్నాళ్ళయ్యింది అంటూ మాట్లాడుకుంటున్నారు. థమన్ మ్యూజికల్ ఆల్బమ్ లో పగ రగిలిన పైరు కలబడితే గుండెల్లో ఫియరూ అంటూ పవన్ కళ్యాణ్ లోని మాస్ యాంగిల్ ని చూపించడమే కాదు పవన్ శత్రువులను ఊచకోత కోసే ఈ టైటిల్ సాంగ్ మాత్రం అభిమానులకే కాదు మ్యూజిక్ లవర్స్ కి ఎక్కేలా ప్లాన్ చేసారు. మరి ఈ ఫైరే కదా అభిమానులు పవన్ నుంచి కోరుకునేది.