అనసూయ భరద్వాజ్ లుక్స్ తో ఎంత మెస్మరైజ్ చేస్తుందో అంతే బోల్డ్ గా మాట్లాడుతుంది. తనను ఇరిటేట్ చేసినా, లేదంటే బ్యాడ్ గా ట్రోల్ చేసినా అనసూయ అస్సలు సహించదు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళను బ్లాక్ చేస్తుంది. అంతేకాదు వాళ్లకు ఎడా పెడా ఇచ్చి పడేస్తుంది. అనసూయ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన సోషల్ మీడియా అకౌంట్ లో 30 లక్షల మందిని బ్లాక్ చేశాను అని చెప్పింది.
తాజాగా అనసూయ మరోసారి అభిమానులపై రెచ్చిపోయింది. చెప్పు తెగుద్ది అంటూ కాస్త సీరియస్ గానే ఆగ్రహం వ్యక్తం చేసింది. అనసూయ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లింది. ఆ మాల్ ఓపెనింగ్ కి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ అనసూయ మాట్లాడుతుండగా.. అక్కడే ముందు వరుసలో ఉన్న కొందరు ఆకతాయిలు ఆమెను చెత్తగా కామెంట్లు చేశారు.
దానితో కోపమొచ్చిన అనసూయ చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య, కుటుంబ సభ్యులను ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా.. ఎదుటి వాళ్లకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి.. మీ ఇంట్లో మీకు సంస్కారం నేర్పలేదా అంటూ అసహనంగా తీవ్రస్థాయిలో మండిపడింది.