మెగా డాటర్ నిహారిక కొణిదెల నటి నుంచి నిర్మాతగా మారింది. ప్రస్తుతం నటనకు బ్రేకిచ్చిన నిహారిక నిర్మాతగా సినిమాలు చేస్తుంది. ఇప్పటికే కమిటీ కుర్రాళ్ళులాంటి బెస్ట్ మూవీని నిర్మించిన నిహారిక రెండో మూవీని రెడీ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే నిహారిక కొణిదెల తాజాగా వదిలిన పిక్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే.
రాజకుమారిలా చీరకట్టి నగలు పెట్టుకుని బ్యూటిఫుల్ గా కాదు యువరాణి మాదిరి, పెళ్లి కుమార్తెలా మెస్మరైజ్ చేసింది అనే చెప్పాలి. మెరూన్ అండ్ గ్రీన్ కాంబో చెక్స్ పట్టు చీరలో నిహారిక కొణిదెల పెళ్లి కూతురు మాదిరి మెరిసిపోయింది.
ప్రస్తుతం నిహారిక రెండో పెళ్లి విషయమై సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ లకు బలం చేకూరుస్తూ రీసెంట్ గా నాగబాబు తన కూతురు నిహారిక మొదటి పెళ్లి విషయంలో తప్పు చేశాను, ఆమె లైఫ్ లోకి ఎవరో ఒకరు వస్తారు, తనకు రెండో పెళ్లి చేసుకోవాలనుంటే చేసుకుంటుంది, ఆ విషయంలో తానేమి అడ్డు చెప్పను, మొదటి పెళ్లి విషయంలో తప్పు చేశాను అంటూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతూనే ఉన్నాయి.