సమంత.. నాగ చైతన్య కి విడాకులిచ్చాక సింగిల్ స్టేటస్ నే మైంటైన్ చేస్తుంది. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లో మూవీ ఆన్ అయ్యాడు. ఇక సమంత కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పేముంది అని మట్లాడడమే కాదు.. కొన్నాళ్లుగా దర్శకుడు రాజ్ నిడమోరు తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వెకేషన్ అంటూ సీక్రెట్ ట్రిప్స్ వేస్తున్నారు.
అంతేకాదు ముంబైలో ఇద్దరూ కలిసి ఒకే కారులో డిన్నర్ డేట్ కి వెళ్లిన వీడియో సంచలనం అయ్యింది. అయితే రీసెంట్ గా సమంత షేర్ చేసిన పిక్ చూస్తే సమంత వేలికి రింగ్ కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. సమంత వేలికి ఆ కొత్త రింగ్ చూసిన వారు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
సమంత రాజ్ నిడమోరు ని సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది, ఆ రింగ్ తో తమ బంధాన్ని అలా రివీల్ చేసింది, అదేదో ఓపెన్ గా చెప్పొచ్చుగా సమంత అంటూ నెటిజెన్స్ సమంతను అడుగుతున్నారు.