మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే కు ఆ చిత్రం బిగ్ షాకిచ్చింది. అయినా టాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ పరిచింది. వరస అవకాశాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చెయ్యడం ఒక ఎత్తైతే.. శ్రీలీల రూపంలో ఆమెను అదృష్టం వరించింది అనే చెప్పాలి. నిన్న విడుదలైన కింగ్ డమ్ కి శ్రీలీల డేట్ ఇవ్వని కారణంగా ఆమె ప్లేస్ లోకి భాగ్యశ్రీ బోర్సే ని తీసుకున్నారు.
విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే స్పై ఏజెంట్ గా కనిపించింది. హీరోతో రొమాన్స్ లేదు, అలాగే విజయ్ దేవరకొండ తో చేసిన హృదయం లోపల సాంగ్ ని ఎడిటింగ్ లో తీసేశారు. ఆ పాటను బలవంతంగా ఇరికించి మెయిన్ సోల్ ను డిస్టర్బ్ చేయలేము గనకే తీసేసాం అంటూ నాగవంశీ సక్సెస్ మీట్ లో చెప్పారు.
ఒక రకంగా కింగ్ డమ్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. ఆమె గ్లామర్ చూపించడానికి సాంగ్స్ లేవు. అది ఆమెకు షాక్.. అయినప్పటికీ కింగ్ డమ్ కి వస్తున్న రెస్పాన్స్ మాత్రం ఆమెకు ఊరటనిస్తున్నాయి. మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసిన కింగ్ డమ్ ఈ వీకెండ్ స్ట్రాంగ్ గా బాక్సాఫీసు వేటకు సిద్దమైంది.
సో అలా ఆమె కేరెక్టర్ కు పేరు రాకపోయినా కింగ్ డమ్ కు మంచి రెస్పాన్స్ రావడం మాత్రం భాగ్యశ్రీ బోర్సే కు ఊరటనిచ్చింది అనే చెప్పాలి.