ఈమధ్యన నటి కల్పిక మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. ఆ మధ్యన పబ్ వ్యవహారంలో కల్పిక రచ్చ మీడియాలో ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో అందరూ చూసారు. బర్త్ డే కేక్ విషయంలో పబ్ యాజమాన్యం, అక్కడి వర్కర్స్ ఆమె ప్రవర్తన వైరల్ అయ్యింది. అంతేకాదు ఆ వ్యవహారం తర్వాత ఆమె ఛానల్స్ లో కూర్చుని ఇంటర్వూస్ ఇస్తూ జర్నలిస్ట్ లపై నోరు పారేసుకుంది.
కట్ చేస్తే మరొకసారి కల్పిక చేష్టలు ట్రెండ్ అయ్యాయి. మరోసారి రచ్చ చేసిన కల్పిక హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ – కనకమామిడి ప్రాంతంలో ఉన్న ఓ రిసార్ట్‌లో హంగామా సృష్టించింది. రిసార్ట్‌కు వచ్చి, రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ కృష్ణపై దురుసుగా కల్పిక, అక్కడే ఉన్న మెనూ కార్డును విసిరేయడం, రూమ్ కీస్‌ను మేనేజర్ ముఖంపై విసరడం, అలాగే అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించింది.
తాజాగా కల్పిక తండ్రి కల్పిక పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. కల్పిక మానసిక పరిస్థితి బాలేదు, డిప్రెషన్ కి లోనై ఆ ఒత్తిడిలో మతిస్థిమితం కోల్పోతోంది, ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది, వైద్యం అందించినా ఫలితం లేదు, కల్పిక ను రీహాబిటేషన్ సెంటర్ కు పంపించండి అంటూ కల్పిక తండ్రి పోలీసులకు మొర పెట్టుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.