రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో అనసూయ తన భర్త భరద్వాజ్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎంతెలా వైరల్ అయ్యాయో చూసారు. తను కొంతమందితో సినిమా చెయ్యడం, కొంతమందిని కలవడం మా ఆయనకు నచ్చదు, ఆ విషయంలో మేము గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి. అనసూయ వాళ్ళ ఆయన అనసూయని ఏమి అనడు, ఏదైనా చేయినిస్తాడు అనుకుంటారు.
నేను బోల్డ్ గా ఉన్నంత మాత్రాన అన్ని చేస్తాను అని కాదు, నన్ను ఎవరైనా ఫ్లట్ చేస్తే మా ఆయనకు నచ్చదు, అదే నేను కూడా చేస్తాను. మా ఆయన చేతకాని వాడు, వాడికేమి తెలియదంటారు, నా అదృష్టం మా ఆయనకు తెలుగు రాదు, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ను ఆయన పట్టించుకోరు. ఆయనలా నేను కూడా ఉండాలని అనుకుంటాను అంటూ మాట్లాడిన అనసూయ సోషల్ మీడియాలో లుక్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
తాజాగా శ్రావణ శుక్రవారం రోజు అనసూయ పట్టు చీరలో దర్శనమిచ్చింది. ఎంతో అందంగా బాపు బొమ్మలా అనసూయ కనిపించడంపై నెటిజెన్స్ అందంగా కామెంట్లు పెడుతున్నారు. సో బ్యూటిఫుల్ అంటూ స్పందిస్తున్నారు.