Advertisement
Google Ads BL

హిట్ కొట్టామని రష్మిక పోస్ట్-విజయ్ రిప్లై


విజయ్ దేవరకొండ కొంతకాలంగా సక్సెస్ కి దూరమయ్యారు. ఆయన ఎప్పటికప్పుడు నమ్మకం చూపిస్తూ కష్టపడుతున్నా విజయం మాత్రం దక్కడం లేదు. ఇప్పుడు కూడా ఆ ఏడుకొండల వాడు అండగా ఉంటే టాప్ లో కూర్చుంటా అంటూ కింగ్ డమ్ ప్రమోషన్స్ లో కాన్ఫిడెన్స్ చూపించారు. నేడు జులై 31 న విడుదలైన కింగ్ డమ్ చిత్రానికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా విజయ్ దేవరకొండ నటనను ప్రేక్షకులు తెగ పొగిడేస్తున్నారు. 

Advertisement
CJ Advs

కింగ్ డమ్ విడుదల సందర్భంగా ఆయన ఫ్రెండ్(గర్ల్ ఫ్రెండ్), టాప్ హీరోయిన్ రష్మిక సోషల్ మీడియా వేదికగా స్పందించారు. విజయ్ నీకు, నిన్ను ఇష్టపడే ఫ్యాన్స్ కు ఈ హిట్ ఎంత కీలకమైనదో నాకు తెలుసు, మనం హిట్ కొట్టాం, MANAM KOTTINAM🔥 అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవ్వగా దానికి విజయ్ దేవరకొండ కూడా రిప్లై ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. 

విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ.. మనం హిట్ కొట్టాం అంటూ హార్ట్ ఎమోజిని జత చేసారు. మరి విజయ్ సినిమాలకు రష్మిక రియాక్ట్ అవడం, రష్మిక సినిమాలకు విజయ్ దేవరకొండ రియాక్ట్ అవడం అనేది చూస్తున్నాం. విజయ్ అభిమానులు కింగ్ డమ్ రిలీజ్ కి ముందు #KingdomMANAMKODTHUNAM అనే హ్యాష్ ట్యాగ్ ని సోషల్  మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

Rashmika Says Manam Kottinam Vijay Deverakonda:

 Rashmika Congratulates Vijay Deverakonda on Kingdom Success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs