Advertisement
Google Ads BL

ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలనం


ఏపీ లిక్కర్ స్కామ్ ఆంధ్ర రాజకీయాల్లో ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో, స్కామ్ కి పాల్పడిన వారిలో హేమ హేమీ వైసీపీ నేతలు జైలు పాలయ్యారో అనేది అందరికి తెలిసిన విషయమే. ఈ స్కామ్ లో విజయ్ సాయి రెడ్డి ఇచ్చిన సమాచారం తో పలువురు బడా నేతలను సిట్ అధికారులు అరెస్ట్ చెయ్యగా, ఈకేసులో బెయిల్ కూడా దొరక్క వైసీపీ నేతలు అల్లాడిపోతున్నారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ లిక్కర్ కుంభకోణంలో సంచలన విషయాలు కుదిపేసాయి. 

లియికర్ స్కామ్ లో కీలక నిందుతుడు A 40 గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఫామ్ హౌస్ లపై సిట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో A 1 గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాలు మేరకు వరుణ్, చాణక్య 12 పెట్టెలో 11 కోట్లు దాచినట్టు సిట్ అధికారుల ముందు అంగీకారించారు. 

గత ఏడాది ఈ స్కామ్ బయటపడుతున్న సమయంలో అంటే 2024 జూన్ లో ఈ మొత్తం దాచినట్టు వరుణ్ బటయపెట్టినట్లుగా అధికారులు తెలిపారు. లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగానే వరుణ్ ని వైసీపీ కీలక నేతలు దేశాన్నిదాటించగా.. తాజాగా దుబాయ్ నుంచి వస్తోన్న వరుణ్ ను సిట్ అధికారులు కాపు కాచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేసారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు శంషాబాద్ మండలం లోని కాచారం గ్రామంలో ఉన్న ఫార్మ్ హౌస్ లో దాడులు చేసి ఈ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. 

ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్ రెడ్డి పేరు మీద ఉన్నట్టు సిట్ అధికారులు.. కనుగొన్నారు. ఇప్పటివరకు ఈ  స్కామ్ లో ఏ పాపం మాకు తెలియదు అంతా కూటమిఁప్రభుత్వ సృష్టి అని వాదించే వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి  ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. 

AP Liquor Scam Case Update:

Andhra Pradesh Liquor Scam Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs