విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన పాన్ ఇండియా ఫిలిం కింగ్ డమ్. రేపు గురువారం జులై 31 న విడుదల కాబోతున్న ఈచిత్రం పై హైప్ ఎంత వుంది అనేది కింగ్ డమ్ బుకింగ్స్ చూస్తే అర్ధమవుతుంది. అయితే ఈరోజు బుధవారమే కింగ్ డమ్ ప్రివ్యూ షోస్ ఉంటాయి.. ప్రీమియర్స్ తోనే కింగ్ డమ్ కి మరింత క్రేజ్ వస్తుంది అనుకున్న మేకర్స్ లాస్ట్ మినిట్ లో ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసారు.
ఈ చిత్రం విజయ్ దేవరకొండ కి అన్నగా క్రేజీ యాక్టర్ సత్యదేవ్ కనిపిస్తుండగా.. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే కనిపించబోతుంది. అయితే కింగ్ డమ్ హీరో హీరోయిన్స్ కి, మిగతా నటులకు, దర్శకుడికి పారితోషికాలుగా నిర్మాత నాగవంశీ ఎంత ముట్టజెప్పారనే వార్త ఇప్పుడు అందరిలో క్యూరియాసిటీ కలిగిస్తుంది.
కింగ్ డమ్ కోసం విజయ దేవరకొండ 30 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా లాభాల్లో కొంత షేర్ రూపంలో తీసుకోనున్నాడని తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి 7 కోట్లు, సత్య దేవ్‌కి 3 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కి 10 కోట్లు, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే కి కోటి.. నిర్మాతలు ముట్టజెప్పినట్టుగా టాక్ వినబడుతుంది.