Advertisement
Google Ads BL

4ఏళ్ల‌లో 750 ఇంజ‌క్ష‌న్లు.. న‌టుడి ధీన‌స్థితి


త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో విల‌న్ గా, స‌హాయ న‌ట‌డిగా సుప‌రిచితుడైన పొన్నంబళం ఇటీవ‌ల‌ మంచం పట్టాడు. సంవత్సరాల తరబడి మద్యపాన వ్యసనం వల్ల అతడి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు త‌న స్టంట్స్ విల‌న్ వేషాల‌తో మెప్పించిన పొన్నాంబ‌లం ప్ర‌స్తుతం అనారోగ్యంతో ధీన స్థితికి చేరుకున్నాడు. అత‌డికి తెలుగు, హిందీ భాష‌ల్లోను ఫాలోయింగ్ ఉంది.

Advertisement
CJ Advs

అయితే పొన్నాంబ‌ళం ఇటీవ‌ల కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో మంచంపై విరామ స్థితిలో ఉన్నాడు. వెంటిలేట‌ర్ పై చికిత్స అందుకుంటున్నాడు. అత‌డి రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో డయాలసిస్ చేయాల్సి వ‌చ్చింది. ఇక పొన్నంబ‌ళం స్టంట్‌మ్యాన్‌గా తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఒక్క గాయం కూడా లేకుండా ప్రమాదకర యాక్షన్ సన్నివేశాల‌లో న‌టించ‌డంలో అత‌డు పాపుల‌ర్. దాని వల్ల అతడికి పరిశ్రమలో `స్పేర్ పార్ట్స్` అనే మారుపేరు వచ్చింది. 1988లో `కలియుగం` అనే చిత్రంతో నటుడిగా అడుగుపెట్టాడు. తరువాత చాలా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించాడు. కెరీర్ పీక్స్ లో ఏడాదికి ఏకంగా ప‌ది చిత్రాల్లో న‌టించాడు.

అయితే పొన్నంబ‌ళం తాగుడుకు బానిస‌. తాగి తాగి చివ‌రికి ప్రాణంపైకి తెచ్చుకున్నాడు. సంవ‌త్స‌రాల పాటు మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాలు విఫ‌ల‌మ‌య్యాయి. 2021 నుండి అత‌డు డయాలసిస్‌లో ఉన్నాడు. డయాలసిస్ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన శిక్ష అని పొన్నంబలం ఇటీవలి ఇంటర్వ్యూలో అన్నారు. నాకు నాలుగు సంవత్సరాలలో 750 ఇంజెక్షన్లు ఇచ్చారు. ప్రతి ప్రత్యామ్నాయ రోజు ఒకే చోట. నేను ఉప్పు తినలేను. నేను పూర్తి భోజనం తినలేను. నా శత్రువులు కూడా ఇలా బాధపడకూడదు అని ఆవేద‌న చెందారు. ఈ చికిత్స కోసం ఆయన రూ. 35 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మొదటిసారి సహాయం చేసిన వ్యక్తి శరత్ కుమార్. త‌ర్వాత ధనుష్ , అర్జున్ స‌హాయం చేసారు. ఒకప్పుడు సెట్‌లో మామ‌ధ్య‌ గొడవ జరిగినప్పటికీ, చిరంజీవి కూడా నాకు ఆర్థికంగా సహాయం చేశారు.. అని తెలిపాడు. ప్ర‌స్తుతం పొన్నంబ‌ళం వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతున్నాడు.

Actor Ponnambalam health update:

750 Injections In 4 Years - Actor Ponnambalam Real-Life story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs