అవకాశాలు లేని నిధి అగర్వాల్ హోప్స్ అన్ని హరి హర వీరమల్లు పైనే పెట్టుకుంది. హరి హర వీరమల్లు లో యువరాణి గా అందంగా కనిపించిన నిధి అగర్వాల్ ఆ సినిమా ప్రమోషన్స్ లో మరింత హాట్ గా గ్లామర్ షో చేసింది. వీరమల్లు ప్రమోషన్స్ లో అన్నిటా నిధి అగర్వాల్ షో నే కనిపించింది. అందరిలో ఆమె హైలెట్ అయ్యింది.
కానీ హరి హర వీరమల్లు రిజల్ట్ తో ఇప్పుడు డిజప్పాయింట్ అవుతుంది. వీరమల్లు తో ఎలాగోలా క్రేజ్ తెచ్చుకుందామనుకుంది. క్రేజ్ వచ్చింది. సినిమా హిట్ అయితే నిధి అగర్వాల్ కి మరింత క్రేజ్ వచ్చేసేది. కానీ వీరమల్లు రిజల్ట్ తేడా కొట్టింది. ఇక నిధి అగర్వాల్ ఇప్పుడు తన హోప్స్ అన్ని రాజా సాబ్ పైనే పెట్టుకుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ద రాజా సాబ్ లో నిధి అగర్వాల్ వన్ ఆఫ్ ద హీరోయిన్. మరో ఇద్దరు హీరోయిన్స్ మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లతో నిధి అగర్వాల్ స్క్రీన్ షేర్ చేసుకుంది. సినిమా హిట్ అయితే నిధికి పేరొస్తుంది. మరో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా పర్లేదు. మరి రాజా సాబ్ అమ్మడు ని ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.