ఏపీలో నారా లోకేష్ విద్య, ఐటి శాఖా మంత్రి గా తన మార్క్ చూపిస్తున్నారు. ప్రజలతో మమేకమవడమే కాదు, ప్రజా సమస్యలు తెలుసుకుని తక్షణం వారి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తన నియోజకవర్గమైన మంగళగిరిని అన్నిటిలో టాప్ లో ఉంచేందుకు లోకేష్ అన్నిరకాలుగా కృషి చేస్తున్నారు.
ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు, లోకేష్ లు, మంత్రి నారాయణ, టిజి భరత్ ప్రముఖులను కలుస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని నాశనము చేసి పలు కంపెనీలు రాకుండా చేసి రాజధానిని నాశనానికి కారకులయ్యారు.
మళ్ళీ అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మినిస్టర్ లోకేష్ లు సింగపూర్ కంపెనీలను తన రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో రెండోరోజు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా లోకేష్, అలాగే టిజి భరత్, మంత్రి నారాయణ భేటీ అయ్యారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని పరిష్కరించే అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. నవంబరులో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కోరాం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ట్రాన్స్ మిషన్ కారిడార్ లు, పోర్టులు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో, సబ్ సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ఆసక్తి కనబరిచినట్లుగా లోకేష్ ట్వీట్ ద్వారా వివరించారు.