మహానటి కీర్తి సురేష్ ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా మారిపోయింది. ఒకప్పుడు ట్రెడిషనల్ కి కేరాఫ్ గా కనిపించే కీర్తి సురేష్ ఇప్పుడు అందాల ఆరబోతకు ఎలాంటి వెనకడుగు వేయడం లేదు. పెళ్లి తర్వాత కూడా నటనకే కాదు అందాలు ఆరబొయ్యడానికి కూడా బ్రేకివ్వలేదు. సినిమా అవకాశాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో కీర్తి సురేష్ చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా Just soaking in some sun #SundayVibes అంటూ కార్ లో వెళుతున్న సండే మూడ్ లో ఉన్న పిక్ ని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ లో కీర్తి సురేష్ వావ్ అనిపించే అందంతో మెస్మరైజ్ చేసింది. ఆ ఫోటో చూడగానే సో బ్యూటిఫుల్ కీర్తి సురేష్ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఉప్పుకప్పురంబు విడుదలయ్యాక కీర్తి సురేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫ్యాన్స్ లో చాలా క్యూరియాసిటీ ఆత్రుత కనిపిస్తున్నాయి. కానీ కీర్తి సురేష్ కి ఇప్పుడు తెలుగు, తమిళనాట కూడా పెద్దగా ఆఫర్స్ వచ్చిన దాఖలాలు ఏమి కనిపించడం లేదు.