గత ఏడాది నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తండేల్ తో హిట్ కొట్టడమే కాదు ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో NC 24 చిత్ర షూటింగ్ లో బిజీగా వున్నాడు చైతు. అయితే పెళ్లి తర్వాత శోభిత తో స్పెండ్ చేసేందుకు సమయం కుదరడం లేదు అన్నాడు చైతు. కారణం ఆమె తన షూటింగ్స్ తో ముంబైలో ఉంటుంది. చైతు హైదరాబాద్ లో ఉంటున్నాడు..
అందుకే ఇద్దరూ కలిసినప్పుడు లంచ్ చెయ్యడం, మూవీస్ కి వెళ్లడం వంటివి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చైతు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన భార్య శోభితను బుజ్జి తల్లి అని ప్రేమగా పిలుచుకునే నాగ చైతన్య షూటింగ్స్ తో తమ మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని రూల్స్ ఫాలో అవుతామని చెబుతున్నాడు.
రీసెంట్ గా శోభితకు రేస్ ట్రాక్ పై డ్రైవింగ్ నేర్పించానని చెప్పిన నాగ చైతన్య తనకు రేసింగ్ ఓ థెరపీ లా పని చేస్తుంది, తనకంటూ పెద్ద లక్ష్యాలు, కోరికలు లేవని చెబుతున్న నాగ చైతన్య 50ఏళ్ళు వచ్చేసరికి భార్య పిల్లలతో కలిసి సంతోషంగా గడపాలని ఉందట. ఒకరినో ఇద్దరినో పిల్లలను ప్లాన్ చేసుకుంటామని, కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తాను, కూతురు పుడితే తన ఇష్టాలకు విలువ ఇస్తాను అని చెబుతున్నాడు.
పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తుంటే అసలు అలసట తెలియదని, తానెలా చిన్నపుడు ఎంజాయ్ చేసాడో, తన పిల్లలతో అలానే ఎంజాయ్ చెయ్యాలనుంది అంటూ నాగ చైతన్య తన ప్లానింగ్ గురించి ఓపెన్ అయ్యాడు.