Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 9 స్టార్టింగ్ డేట్ వచ్చేసింది


బిగ్ బాస్ సీజన్ 9 పై క్రేజ్ పెంచేలా యాజమాన్యం చాలానే ప్లాన్ చేస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా పలు ప్రోమోలు వదులుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంది. అసలే కొన్ని సీజన్స్ నుంచి బిగ్ బాస్ పై క్రేజ్ తగ్గుతూ రావడంతో.. ఈ సీజన్ కి అలా జరగకుండా ఉండేలా ముందే ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.  

Advertisement
CJ Advs

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9 కోసం కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి కాగా సామాన్యుల ఎంట్రీ కోసం పోల్ కండక్ట్ చేసారు. అందులో లక్షకు పైగా బిగ్ బాస్ సీజన్ 9 కోసం రిజిస్టేషన్ చేసుకున్నారు. సీరియల్ యాక్టర్స్ సాయికిరణ్, దేబ్‌జనీ మోదక్‌, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కావ్యశ్రీ , జబర్దస్త్ ఐశ్వర్య, బమ్ చిక్ బబ్లూ, రీతూ చౌదరి, అలేఖ్య చిట్టి పికెల్స్ ఫేం రమ్య మోక్ష, సినీనటి కల్పికా గణేష్, హీరో సుమంత్ అశ్విన్, ఆర్జే రాజ్, శ్రావణి వర్మ, తేజస్విని గౌడ, పరమేశ్వర్ హివ్రాలే, జానపద సింగర్ నాగదుర్గా దత్తా, లక్ష్మి పేర్లు సీజన్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. 

ఇక సామాన్యుల ఎంట్రీ కోసం వచ్చిన దరఖాస్తుల్లో నుంచి తొలి విడతలో 200 మందిని సెలెక్ట్ చేశారు. వారిని అన్ని రకాల పరీక్షలతో 100 మందిని బయటకు తీశారు. అందులోనుంచి 40 మందిని ఫైనల్‌గా సెలెక్ట్ చేశారు. ఆ 40 మందికి పలు రకాల పోటీలు పెట్టి.. వీరిలో నుంచి ముగ్గురికి సామాన్యుల కోటాలో కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేయనున్నారు. 

తాజాగా వదిలిన ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 7 నుంచి బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభం కానుందని.. స్టార్ మా, జియో హాట్ స్టార్‌లో సీజన్ 9 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నట్లుగా అనౌన్స్ చేసారు. 

Bigg Boss Telugu 9 Starting Date announced:

Bigg Boss 9 Telugu to premiere on September 7
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs