ఎప్పుడు స్మార్ట్ గా స్టైలిష్ లుక్స్ లో కనిపించే నాగార్జున కూలి చిత్రంలో విలన్ రోల్ లో ఎలా కనిపిస్తారు, లోకేష్ కనగరాజ్ నాగార్జున ను ఎలాంటి లుక్ లో ఎంత విలనిజంతో ప్రెజెంట్ చెయ్యబోతున్నారు అనే విషయంలో అక్కినేని అభిమానులే కాదు తెలుగు తమిళ ఆడియన్స్ బాగా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఈమధ్యన కుబేర లో నాగార్జున కాస్త నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేసి తమిళ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు.
నాగార్జున ని కూలి రోల్ కోసం ఒప్పించడానికి చాలా కష్టపడినట్లుగా లోకేష్ ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ నాగార్జున ని విలన్ గా వేరే లెవల్లోప్రెజెంట్ చేయబోతున్నారనే విషయాన్ని లోకేష్ కనగరాజ్ చెప్పడమే కాదు హీరోయిన్ శృతి హాసన్ కూడా చెబుతుంది. శృతి హాసన్ నాగ్ రోల్ గురించి మాట్లాడుతూ..
నాగార్జున గారితో నాకు కూలి కంటే ముందు నుంచే పరిచయముంది. నాగ్ ఎప్పుడు ఆక్టివ్ గా ఛార్మింగ్ గా, వండర్ ఫుల్ గా ఉంటారు. కూలి లో ఆయనతో వర్క్ చేయడం ఎక్స్ట్రా స్పెషల్. ఎందుకంటే నాగ్ సార్ కి ఇది ఫస్ట్ నెగెటివ్ క్యారక్టర్. ఆయన ఆ పాత్రలో ఫెంటాస్టిక్‌గా నటించారు. నేను మొదటి నుంచి నాగ్ కి అభిమానినే. కానీ ఇప్పుడు మేము నాగార్జున కు సూపర్ ఫ్యాన్స్ అయిపోయాం.
మీరు కనీసం నాగ్ విలన్ రోల్ ఎలా ఉంటుందో అనేది ఊహించను కూడా ఊహించలేరు. అది మాత్రం చెప్పగలను. కూలి లో నాగార్జున చాలా కూల్ గా కనిపిస్తారు అంటూ శృతి హాసన్ నాగార్జున విలన్ రోల్ పై విపరీతమైన అంచనాలను పెంచేసింది.