Advertisement
Google Ads BL

రిటైర్ అయ్యాక క్యాబ్ డ్రైవర్ అవుతా: FaFa


మలయాళ స్టార్ హీరో విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం తమిళంలో కమెడియన్ వడివేలు తో కలిసి నటించిన మారిసన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన తన ఇతర సినిమాలపై అలాగే సినిమాల నుంచి రిటైర్ అయ్యాక తనేం చేస్తారో అనే విషయాలని పంచుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

తాను ఫ్యూచర్ లో సినిమాలు వదిలేసి రిటైర్ అయ్యాక క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తాను అంటూ హాట్ కామెంట్స్ చేసారు. తనకు కార్ డ్రైవింగ్  అంటే ఇష్టమని, ప్రయాణికులను అక్కడికి ఇక్కడికి చేరవేయడం చేస్తాను, అందులో తప్పేమి లేదు అంటూ ఫహద్ ఫాసిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం స్పెయిన్ లోని బార్సిలోనాకు వెళ్ళాం. నాకు ఇష్టమైన ప్రదేశం అది. అక్కడ క్యాబ్ డ్రైవ్ చెయ్యడం ఇష్టమని చెప్పారు ఆయన. 

తనని ఇకపై స్క్రీన్ పై చూడలేకపోతున్నామని ప్రేక్షకులు భావించినప్పుడు తను సినిమాలకు విరామం ప్రకటించి బార్సిలోనా వెళ్లి అక్కడ క్యాబ్ డ్రైవ్ చేస్తాను, అది నాకు ఎప్పటికీ బోర్ కొట్టదు. నేను రిటైర్ అయ్యాక బార్సిలోనా వెళ్లి ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా చేరుతాను, నేను ఇది సరదాగా చెప్పడం లేదు, నిజంగా అదే చేస్తా అంటూ ఫహద్ ఫాసిల్ చెప్పుకొచ్చారు. 

Fahadh Faasil dreams of Uber Driver:

Fahadh Faasil shares his Uber driver dreams
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs