మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్-బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 ఆగష్టు 14 న విడుదల కాబోతుంది. గత నెలరోజులుగా వార్ 2 ప్రమోషన్స్ ను హీరోలిద్దరూ స్టార్ట్ చేసారు. నిర్మాతలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ విడివిడిగా వార్ 2 ను ప్రమోట్ చేస్తారని చెప్పారు. తాజాగా వార్ 2 ట్రైలర్ ని వదిలారు మేకర్స్.
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను కాదు కాదు మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ ట్రీట్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ లుక్స్, హృతిక్ రోషన్ లుక్స్, మాస్ ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ విజువల్స్, ఆకట్టుకునే డైలాగులతో వార్ 2 ట్రైలర్ దుమ్ములేపింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు తమ తమ పాత్రలతో చెలరేగిపోయారని వార్ 2 ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
ఎన్టీఆర్-హృతిక్ మధ్యన యాక్షన్ సీన్స్ వార్ 2 కి మేజర్ హైలైట్స్. ప్రీతమ్ మ్యూజిక్, BGM, ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్ అన్ని రిచ్ గా వార్ 2 కు అద్భుతంగా కుదిరాయి. కియారా అద్వానీ అందంగా బ్యూటిఫుల్ షో చేసింది.