సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలి సినిమాని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం కూలి ప్రమోషన్స్ లో కనిపిస్తున్నారు. ఆగస్టు 2 న విడుదల చెయ్యబోయే కూలి ట్రైలర్ తోనే మొత్తం మారిపోతుంది అంటూ అంచనాలు పెంచేస్తున్నారు . ఇక సూపర్ స్టార్ రజినీకాంత్, కింగ్ నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ నటిస్తున్న కూలి చిత్రంలో నాగార్జున విలన్ రోల్ ప్లే చేస్తున్నారు.
స్టార్ హీరోలను నెగెటివ్ గా చూపించడంతో లోకేష్ కనగరాజ్ సిద్దహస్తుడు. రోలెక్స్ గా సూర్య ని మాస్ కాదు ఒళ్ళు గగుర్పొడిచే అవతార్ లో చూపించి షాకిచ్చారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ని లోకేష్ కనగరాజ్ ముందుగా విలన్ గా చూపించాలనుకున్నారట అంటే కూలి చిత్రం కాకుండా మరో కథలో సూపర్ స్టార్ ని విలన్ ని చెయ్యాలని లోకేష్ అనుకున్నారట.
ఆ సినిమా చెయ్యడానికి రెండేళ్ల సమయం పడుతుంది. కానీ రజినికాంత్ వరసగా సినిమాలు కమిట్ అయ్యి ఉన్నారు. నేను నా సినిమా కోసం రెండేళ్లు లాక్ చెయ్యడం కుదరదు, బాగోదు.. అంతేకాదు అదే సమయంలో నాకు వ్యక్తిగత సమస్యలు కూడా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి కూలి చిత్రాన్ని చేశాను అంటూ లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ ని విలన్ గా చూపించాలనుకున్న విషయాన్ని రివీల్ చేసారు.