పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాతగా దర్శకుడు క్రిష్ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో హరి హర వీరమల్లు చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీకల్ టీమ్ సెట్ అయ్యింది. పవన్ డేట్స్ ఇవ్వడం లేట్ అవడంతోనో, లేదంటే మారేదన్నా రీజనో తెలియదు కానీ.. హరి హర వీరమల్లు ఓ 70 శాతం షూటింగ్ పూర్తయ్యాక క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయారు. మరి అంతపెద్ద ప్రాజెక్ట్ ను క్రిష్ వెళ్ళిపోయిన కారణంగా పక్కనపడెయ్యలేరు కదా..
ఆ తర్వాత జ్యోతి కృష్ణ వీరమల్లు దర్శకత్వ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టారు. అప్పటికి పవన్ కళ్యాణ్ వస్తున్న దాన్ని బట్టి షూటింగ్ ప్లాన్ చేసుకుని సినిమాని పూర్తి చేసారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే గ్రాఫిక్స్ వర్క్, మిగతా విషయాల్లో శ్రద్ద తీసుకోవడానికి సమయం లేదు, వీరమల్లు రిలీజ్ డేట్ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఒత్తిడి.
ఇక రకరకాల కారణాలతో హరి హర వీరమల్లు హరీబరిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి దిగిపోయింది. వీరమల్లుని వీక్షించిన వారు ఫస్ట్ హాఫ్ బావుంది. అది క్రిష్ డైరెక్ట్ చేసి ఉంటారు, సెకండ్ హాఫ్ పూర్తిగా ట్రాక్ తప్పింది. అందులోను పోస్ట్ ప్రొడక్షన్ చెత్తగా ఉంది. విఎఫెక్స్ గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు. ఇది జ్యోతి కృష్ణ డైరెక్షన్ అయ్యుంటుంది అంటూ మాట్లాడుకుంటున్నారు.
విఎఫెక్స్ అంత చెత్తగా ఉంది. అసలు క్రిష్ హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమే ఈ సినిమాపై హైప్ లేకుండా పోయింది. క్రిష్ ఉండి ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యేది అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరి వీరమల్లు డ్యామేజ్ క్రిష్ లేకపోవడం వలనే జరిగిందంటారా..!