ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కనిపించి చాలా రోజులే అయ్యింది. రోజులు కాదు ఏళ్ళు అవుతుంది. వరస సినిమాలు ప్లాప్ అవడంతో రకుల్ ప్రీత్ పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయింది. తెలుగు ఆడియన్స్ కూడా కొత్త మోజులో రకుల్ ని పట్టించుకోవడం మానేశారు.
అయినప్పటికీ రకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోస్ వదులుతూ హడావిడి చేస్తూ ఉంటుంది. అవి చూసినప్పుడు అయ్యో ఈ ముద్దుగుమ్మని కాస్త పట్టించుకోమంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతూ ఉంటారు. ఇక బాలీవుడ్ లోనే తిష్ట వేసిన రకుల్ కి అక్కడ కూడా హిట్లు పడడమే లేదు.
సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ జిమ్, యోగ తో నాజూగ్గా కనిపించే రకుల్ కి టాలీవుడ్ డోర్స్ ఆల్మోస్ట్ మూసుకుపోయినట్లే. తాజాగా ఆమె వదిలిన గ్లామర్ పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. అంతలాంటి అందాల ఆరబోతతో రకుల్ ప్రీత్ షో వైరల్ అవుతుంది.