సోమవారం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను నటించిన హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో చాలా బిజీగా కనిపించరు. ఉదయం ప్రెస్ మీట్ సాయంత్రం ఈవెంట్, ఉదయం మీడియా మీట్ సాయత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్, హైదరాబాద్, మంగళగిరి, వైజాగ్ అంటూ గత మూడురోజులుగా వీరమల్లుని పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేసారు.
ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రమోషన్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. నిన్నటివరకు సినిమా విషయాల్లో తలమునకలైన పవన్ కళ్యాణ్ ఈరోజు తన డ్యూటీ ఎక్కేసారు. ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో సీఎం చంద్రబాబు తో కలిసి కూర్చున్నారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటి మొదలైంది. అందులో పవన్ కళ్యాణ్ పాల్గొనడం చూసిన వారు నిన్నటివరకు వీరమల్లు ప్రమోషన్స్-ఈరోజు డిప్యూటీ సీఎం గా డ్యూటీ మొదలు పెట్టేసిన పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.