పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత బిగ్ స్క్రీన్ పైకి రానుండడంతో పవన్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అందులోను పవన్ హరి హర వీరమల్లు పదే పదే వాయిదా పడుతూ రిలీజ్ కి రావడంతో పవన్ ఫ్యాన్స్ లో అత్యుత్సాహం ఎక్కువైంది. హరి హర వీరమల్లు ప్రీమియర్స్ వేసిన థియేటర్స్ దగ్గర హంగామా సృష్టించారు.
జులై 23 నైట్ నుంచే హరి హర వీరమల్లు ప్రీమియర్స్ స్టార్ట్ అవడంతో పవన్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద టపాసులు కాలుస్తూ అతి చేశారు. మచిలీపట్నంలోని రేవతి థియేటర్ వద్ద ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అలాగే కడప లోని రాజా థియేటర్ వద్ద కూడా పవన్ అభిమానులు రెచ్చిపోయి రచ్చ చేసారు. ఇరు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు.
అంతేకాదు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద కూడా పవన్ ఫ్యాన్స్ హంగామా మాములుగా లేదు. అయితే గత (పుష్ప 2 ప్రీమియర్స్) అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసలు థియేటర్స్ వద్ద గట్టి చర్యలు తీసుకున్నారు. చిన్న పిల్లలతో సినిమాకు వచ్చిన మహిళలను తిరిగి పంపించారు. కొన్ని ప్రాంతాల్లో అభిమానులను కట్టడి చేయలేక పోలీసులు లాఠీచార్జ్ కూడా చేయాల్సి వచ్చింది.