Advertisement
Google Ads BL

హరి హర వీరమల్లు - ట్రోల్ మెటీరియల్


పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ఎట్టకేలకు అన్ని అడ్డంకులు దాటుకుని నేడు జులై 24 న థియేటర్స్ లో విడుదలైంది. హరి హర వీరమల్లు ని చూసిన కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు పవన్ ఫ్యాన్స్  కూడా డిజప్పాయింట్ అవుతున్నారు. పవన్ అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా వీరమల్లు వీక్షించిన తర్వాత ఎంతో ఆవేదనతో పెట్టిన పోస్ట్ యధాతధంగా.. 

Advertisement
CJ Advs

కర్ణుడి చావుకు లక్ష కారణాలు అంటారు కదా.. వీరమల్లు విషయంలో కూడా ఇదే జరిగింది..

30 రోజుల సీన్ 3 రోజులు.. 8 గంటల కాల్షీట్ 2 గంటలకు పడిపోయినప్పుడే..

సినిమా క్వాలిటీ అమాంతం పడిపోయిందని మనం ముందుగానే అర్థం చేసుకోవాలి..

అన్నీ ముందుగానే తెలిసిపోతున్నా కానీ.. 

పవన్ ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడులే అని ఏదో ఒక చిన్న ఆశ లోపల అలాగే ఉండిపోయింది..

హరిహర వీరమల్లు చూసిన తర్వాత అది కూడా పోయింది.. 

ఫస్టాఫ్ చూశాక పర్లేదు ఏదో ట్రై చేశాడు.. మరీ దారుణంగా అయితే లేదు కదా అనుకున్నా..

సరిగ్గా అప్పుడే మొదలైంది సెకండ్ హాఫ్..

పవన్ కళ్యాణ్ భక్తుడిగా నిజం చెప్తున్నా.. సెకండాఫ్ చూశాక ఈ సినిమా విడుదల కాకపోయి ఉంటే బాగుండేది అనిపించింది..

సీజీ వర్క్స్ ఇంత దారుణంగా ఒక సినిమాకు చేయొచ్చని ఇది చూసాకే అర్థమైంది..

అస్సలు ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా చెప్పుకునేలా లేదు..

ఫస్టాఫ్ బాగుందని సంతోషించేలోపే.. సెకండాఫ్ భయపెట్టింది..

చిన్న చిన్న సినిమాలకు కూడా ఎంతో అద్భుతమైన గ్రాఫిక్స్ చేసుకుంటున్న ఈ రోజుల్లో..

పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఉన్న ఇలాంటి సిజి చేశారంటే తప్పు ఎవరిది..?

ఇందులో పవన్ తప్పు కూడా ఉంది.. 

ఆయన ఉన్న బిజీకి ఇలాంటి సబ్జెక్టు ఓకే చేయడమే తప్పు..

చేశాక కచ్చితంగా డేట్స్ ఇవ్వాలి.. ఇవ్వకుండా చుట్టేస్తాం అంటే ఇలాంటి ఫలితమే వస్తుంది..

ఇందులో దర్శక నిర్మాతల తప్పు ఎంత ఉందో.. పవన్ తప్పు కూడా అంతే ఉంది..

ఆయన డేట్స్ ఇవ్వలేదు.. ఇచ్చిన డేట్స్ అసలు సరిపోలేదు.. ఫలితం స్క్రీన్ పై కనిపించింది..

సినిమాను దారుణమైన ట్రోల్ మెటీరియల్ గా నిలబెట్టింది..

ఆ సీజీ దెబ్బకు కొన్ని మంచి సీన్స్ కూడా నాశనం అయిపోయాయి..

సెకండాఫ్ కథ ఎటు వెళ్తుందో కూడా అర్థం కాలేదు..

ప్రతిసారి ఒక కష్టం రావడం.. హీరో వెళ్లి దాన్ని పరిష్కరించడం.. ఇదే సరిపోతుంది..

హిందూ ధర్మ రక్షణ అనే మంచి పాయింట్ తీసుకున్నప్పుడు.. దానిమీద ఇంకొన్ని మంచి సీన్స్ రాసుకొని ఉంటే బాగుండేది..

అది వదిలేసి కథని ఏటెటో తీసుకెళ్లిపోయారు..

టైం లేనప్పుడు ఇలాంటి బ్యాడ్ ఔట్ పుట్ ఇచ్చేకంటే.. 

పవన్ సినిమాలు చేయకపోవడమే మంచిది అభిమానిగా నా అభిప్రాయం..

పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి.. ఆయన స్వాగ్ కనిపిస్తుంది అంతే..

ఆయన తప్ప మిగిలిన ఏ పాత్ర గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు..

కీరవాణి సంగీతం కూడా జస్ట్ ఓకే..

విజువల్స్ మరీ దారుణం.. క్వాలిటీ కూడా..

ఓవరాల్ గా హరిహర వీరమల్లు.. పూర్ గ్రాఫిక్స్ కు బలైపోయింది..!

Hari Hara Veera Mallu Public Talk:

Hari Hara Veera Mallu Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs