పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత చేసిన స్ట్రయిట్ చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో మొదలై జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ముగిసిన ఈ చిత్రం పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కింది. నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించిన వీరమల్లు నేడు జులై 24 న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ గా విడుదలైంది. గత రాత్రి నుంచే హరిహర వీరమల్లు ప్రీమియర్స్ అంటూ పలు సిటీస్ లో సందడి చేసింది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కటౌట్ లు పెట్టి బ్యానర్ లు కట్టి టపాసులు కాలుస్తూ హరి హర వీరమల్లు థియేటర్స్ వద్ద హంగామా చేసారు. ఇటు ప్రీమియర్స్, అటు ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతో సోషల్ మీడియాలో హరి హర వీరమల్లు సినిమాపై ప్రేక్షకులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
వీరమల్లు గా పవన్ కళ్యాణ్ లుక్స్ వైజ్ గా, కేరెక్టర్ వైజ్ గా అద్భుతంగా కనిపించారు, ఫస్ట్ హాఫ్ గుడ్ స్టోరీ, కానీ యావరేజ్ మ్యూజిక్, బిలో యావరేజ్ స్క్రీన్ ప్లే అంటూ సినిమాని వీక్షించిన కొంతమంది ఆడియన్స్ స్పందిస్తున్నారు. సెకండ్ హాఫ్ బావుంది అని కొంతమంది, కాదు సెకండ్ హాఫ్ తేడా కొట్టింది అని కొంతమంది స్పందిస్తున్నారు.
ప్రీ క్లైమాక్స్ సూపర్బ్ గా ఉంది, క్లైమాక్స్ కూడా నచ్చేసింది. పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హరి హర వీరమల్లు కే హైలెట్ అంటూ పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ సైతం రియాక్ట్ అవుతున్నారు. లాస్ట్ 20 నిమిషాల కోసం హరి హర వీరమల్లు సినిమా మొత్తాన్ని చూసేయ్యొచ్చు అంటూ ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.
కాకపోతే హరి హర వీరమల్లు కి మెయిన్ మైనస్ పాయింట్ గ్రాఫిక్స్. పవన్ కళ్యాణ్ ని కొన్ని చోట్ల AI లో చూపించారా అంటూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు క్రిష్ వీరమల్లు ప్రాజెక్ట్ ని వదిలెయ్యడం అతిపెద్ద బ్లండర్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం చెడగొట్టారంటూ మరికొంతమంది వీరమల్లుని వీక్షించిన వారు స్పందిస్తున్నారు.