మెగాస్టార్ చిరంజీవి తన వద్దకు వచ్చే కథలను ఆచి తూచి ఓకె చేస్తారని అంటారు. అంత ఈజీగా చిరుని ఒప్పించడం కష్టమంటూ చాలామంది దర్శకులు చెబుతూ ఉంటారు. కానీ వసిష్ఠ అదేనండి విశ్వంభర దర్శకుడు చిరు కి సింగిల్ సిట్టింగ్ లోనే కథ చెప్పి ఒప్పించాను అంటున్నారు.
విశ్వంభర రిలీజ్ తేదీ విషయం క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా విశ్వంభర విషయాలను మీడియా కి షేర్ చేస్తున్న దర్శకుడు వసిష్ఠ చిరు తో మొదటిసారి మీటింగ్ విషయమై చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ రజిని గారికి ఒక కథ చెప్పి ఒప్పించాను, ఆయన కూడా ఒప్పుకున్నారు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆ సమయంలోనే చిరు కి కథ చెప్పే అవకాశం వచ్చింది. బింబిసార తర్వాత చిరుతో సినిమా చేసే అవకాశం వచ్చింది.
నేను ఎంతో ఇష్టపడే హీరోకి మెగాస్టార్ ముందు కూర్చున్నాను అనే ఆలోచనే నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆయనకు కథ చెప్పే ముందు భయంగా మాత్రం అనిపించలేదు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఆయన ఇస్తారు. చిరంజీవిగారి కళ్లలోకి చూస్తూ కథ చెప్పడం కూడా అంత తేలికైన విషయమేం కాదు.
కానీ నేను చెప్పిన కథ విన్న తరువాత ఆయన తన నిర్ణయాన్ని చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఈ సినిమా చేస్తున్నామని చెప్పగానే, ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది అంటూ తన కథను చిరు ఈజీగా ఒప్పుకున్నట్టుగా వసిష్ఠ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.