హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ కి డెకాయిట్ మూవీ సెట్ లో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ చిత్రం లో ముందుగా శృతి హాసన్ హీరోయిన్ గా కొద్దిమేర షూటింగ్ చేసాక ఆమె తప్పుకున్న ఆ ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. .
షూటింగ్ మాత్రమే కాదు డెకాయిట్ రీల్స్ అంటూ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ సినిమాని ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతున్నారు. తాజాగా డెకాయిట్ షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగి అడివి శేష్ కి మృణాల్ ఠాకూర్ కి గాయాలైనట్లుగా, అవి కాస్త పెద్దగానే తగిలినట్లుగా తెలుస్తుంది.
షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ క్రింద పడిన శేష్, మృణాల్ కు గట్టిగానే గాయాలు అయినట్టు టాక్ వినిపిస్తుంది. గాయాలైనప్పటికీ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లు ఆ షూటింగ్ ని కంప్లీట్ చేసారని చెబుతున్నారు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లినట్టుగా తెలుస్తుంది.