హరి హర వీరమల్లు ఎన్నో ఏళ్ళు సెట్ పైనే ఉంది, ఎన్నోసార్లు వాయిదాల పడి ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో హరి హర వీరమల్లు విడుదల కాబోతుంది. ఏఎం రత్నం ఎన్నో కష్టాలను ఓర్చి సినిమాని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. సినిమా ఏళ్ళ తరబడి సెట్ పై ఉండడంతో బడ్జెట్ తలకు మించిన భారమైంది. అప్పులు, వడ్డీల తో రత్నం సమస్యలు ఎదుర్కొన్నారు. సినిమా విడుదలవుతున్న సమయంలోను ఆయన ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హారి హర వీరమల్లు కోసం సింగిల్ పైసా పారితోషికం తీసుకోకుండా పని చేశారనే విషయం ప్రచారంలో ఉండడమే కాదు.. తాజాగా ఆయన మీడియా వారు అడిగిన ప్రశ్నకు అదే సమాధానమిచ్చారు. హరిహర వీరమల్లుకు పారితోషకం ఎంత తీసుకున్నారు అని అడిగితే.. ఇంకా ఏమీ తీసుకోలేదని, అలా అని తాను రెమ్యూనరేషన్ తీసుకోనని ఏమీ చెప్పలేదు.
హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్టయ్యి, భారీ కలెక్షన్స్ వస్తే పారితోషకం తీసుకుంటానన్నారు. అంటే హరి హర వీరమల్లు హిట్టు పై పవన్ రెమ్యునరేషన్ ఆధారపడి ఉంది. అసలే పార్టీని నడిపేందుకు, ఫ్యామిలీ ని పోషించుకోవడానికి సినిమాలు చేస్తున్నాను, ఆ పారితోషికాలతోనే నేను పార్టీని నడుపుతున్నాని.. అందుకే రీమేక్స్ చేసి త్వరగా పని ముగిస్తున్నా అని పవన్ చెప్పారు.
సో వీరమల్లు హిట్ అయితేనే పవన్ కి డబ్బులొచ్చి సేఫ్ అవుతారు. లేదంటే పవన్ కూడా నష్టపోతారు.