Advertisement
Google Ads BL

యాంకర్ రష్మీ సెన్సేషనల్ డెసిషన్


జబర్దస్త్ లో ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్.. అదే ఛానల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా గ్లామర్ గా యాంకరింగ్ చేస్తుంది. ఒకప్పుడు సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న రష్మీ కి వెండితెర ఎప్పటికప్పుడు షాకివ్వడంతో అమ్మడు బులితెరపైనే ఫిక్సయ్యింది. ఈమధ్యన హెల్త్ విషయంలో ఇబ్బంది పడి సర్జరీ చేయించుకున్న రష్మీ గౌతమ్ ఇప్పుడొక సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. 

Advertisement
CJ Advs

రష్మీ తీసుకున్న నిర్ణయానికి ఆమె అభిమానులు మాత్రమే కాదు నెటిజెన్స్ కూడా షాకవుతున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న రష్మీ ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఓ నెల పాటు బ్రేక్ తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. అంతేకాదు ప్రస్తుతం నేను పర్సనల్ గానూ, కెరీర్ పరంగానూ కాస్త ఇబ్బందులో ఉన్నాను. అలాగే సోషల్ మీడియాలో చెప్పే అడ్డమైన నీతులు వినే ఓపిక, తీరిక నాకు లేదు.. 

అందుకే నెల రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను మళ్లీ స్ట్రాంగ్ గా, ధైర్యంగా తిరిగొస్తానని హామీ ఇస్తున్నాను. నేను ఇంకా చాలా నిరూపించుకోవాల్సి ఉంది. నా శక్తిని నేను పునరుద్ధరించుకోవాల్సిన అవసరముంది. దానికి మీ డిజిటల్ ఎంకరేజ్ మెంట్ అవసరం లేదు. నాకున్న కాన్ఫిడెన్స్ తో దాన్ని సాధించుకోలగను.. 

నాకున్న ఆత్మవిశ్వాసాన్ని నేనెప్పుడు కోల్పోలేదు. అదెప్పుడూ నా దగ్గరే ఉంటుంది. అయితే ఎక్కడో ఓ చోట నేను బాగా కుంగిపోతున్నాను. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కనుక్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా లేకపోయినా మీ ప్రోత్సాహం, ప్రేమ, సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను.. అంటూ రష్మీ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. 

Rashmi Gautam Sensational Decision:

Anchor Rashmi Gautam announces a month-long break from social media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs