మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ఏ విషయమైనా మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంది. గతంలో నయనతార మేకప్ పై కామెంట్స్ చేసి ఆమె అభిమానుల చేతిలో అడ్డంగా బుక్ అయ్యింది. తాజాగా ఆమె నటులు(స్టార్స్) పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా పరిశ్రమలో హీరోలు-హీరోయిన్స్ సమానమంటారు, కానీ పారితోషికం విషయంలో హీరోలకు ఎక్కువ ఇచ్చి, హీరోయిన్స్ కి చూసి చూసి ఇస్తారు. సినిమా ఇండస్ట్రీలో మగ-ఆడ తారతమ్యం ఉండకూడదు. కానీ ఇక్కడ అది ఎక్కువ, హీరోలకు దొరికే మర్యాద హీరోయిన్స్ కి ఇవ్వరు అంటూ మాళవిక సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
సినిమాల్లో కనిపించే హీరోలు కొంతమంది అమ్మాయిల మధ్యన మంచిగా కనిపించాలని నటిస్తూ ఉంటారు. అలాంటి మేకవన్నెపులులు సమయం చూసుకుని అమ్మాయిల ముందు వారి అసలురంగు బయటపెడతారు. అలా గత ఐదేళ్ళలో ముఖానికి మాస్క్ వేసుకున్న హీరోలను తను చూసాను అంటూ మాళవిక మోహనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
మొహానికి అందమైన మాస్క్ వేసుకుని పలువురు నటులను చూసాను, వారంతా బుద్ధిమంతులు అని భావించకూడదు, వారికి ఏయే సమయంల్లో ఎలా ఉండాలో అనేది బాగా తెలుసు. కానీ కెమెరా వెనుక వారి అసలు బండారం బయటపెడతారు, అనేది నాకు బాగా తెలుసు. మరి మాళవిక మోహనన్ కు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురై ఉటుంది, అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తుంది అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.