కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, మోహన్ బాబు ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చెన్నై వెళితే మోహన్ బాబు సూపర్ స్టార్ ఇంటికి వెళ్లకుండా రారు. ఇక రజిని హైదరాబాద్ వస్తే మోహన్ బాబు ఇంటికి వెళ్లకుండా చెన్నై కి వెళ్లరు. అంతేకాదు మోహన్ బాబు తిరుపతి ఇంటికి కూడా రజిని అపుడప్పుడు వెళుతూ ఉంటారు.
తాజాగా మోహన్ బాబు రజనీకాంత్ తో తనకున్న అనుబంధం పై అలాగే తనకిచ్చిన సలహా ని బయటపెట్టారు. రజినీకాంత్ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మా ఇద్దరి మధ్య 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. నేను రజినీని ఏయ్ బడ్లీ తలైవా అని పిలుస్తాను, మా ఇద్దరి మధ్యన అంత చనువు, స్నేహం ఉంది. 50 ఇయర్స్ ముందు మేము నటులుగా పరిచయం కాక ముందే.. మద్రాస్ ప్లాట్ ఫామ్ పై మొదటిసారి కలుసుకున్నాం.
అప్పటినుంచి మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా మేము కలిసినప్పుడు రజిని నాకొక మాట చెప్పాడు. నాకు గతంలో ఎంత కోపం ఉండేదో నీకు తెలుసు. నేను దానిని తర్వాత కాలంలో వదిలేసాను, నువ్వెందుకు వదలలేకపోతున్నావ్. బుక్స్ చదవడం కాదు, అందులోని మెసేజ్ కూడా అర్ధం చేసుకుని ఆ కోపాన్ని వదిలెయ్ అని చెప్పారు అంటూ మోహన్ బాబు రజినీకాంత్ తనకిచ్చిన సలహా గురించి చెప్పుకొచ్చారు.