క్యూట్ అండ్ స్వీట్ బ్యూటీ శ్రీలీల ఇప్పుడు సౌత్ లోనే కాదు నార్త్ లోను ఓ ఊపు ఊపెయ్యడానికి రెడీ అయ్యింది. సౌత్ లో ఆమె నటించిన సినిమాలేవీ సక్సెస్ కాకపోయినా కానీ శ్రీలీల కు అవకాశాలు ఆగడం లేదు. హిందీలో శ్రీలీల ఇప్పుడు క్రేజీ తారగా మారిపోయింది. కార్తీక్ ఆర్యన్ తో కలిసి హిందీలోకి అడుగుపెడుతున్న శ్రీలీల ఆ సినిమా రిలీజ్ కాకూండానే స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి ఓ బిగ్ ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.
ఇక సౌత్ లో పుష్ప 2 కిస్సిక్ సాంగ్ హిట్ తర్వాత మళ్లీ రేజ్ అయిన శ్రీలీల కు నితిన్ రాబిన్ హుడ్, కిరీటి రెడ్డి జూనియర్ రెండు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ ఇచ్చాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఫొటోస్ షేర్ చేసే శ్రీలీల తాజాగా వదిలిన పిక్ మాత్రం బ్యూటిఫుల్ గా అల్లరిగా కనిపించి కవ్వించింది.
గ్లామర్ గాను, ట్రెడిషనల్ గాను అద్భుతంగా అందాలు చూపించే శ్రీలీల తాజాగా బెడ్ పై కనిపించింది. బెడ్ పై నవ్వుతూ కవ్వించడం ఆమె అభిమానులను మాత్రమే కాదు యూత్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది. మీరు కూడా శ్రీలీల న్యూ లుక్ ని ఓసారి చూసెయ్యండి.