హీరోయిన్ నిధి అగర్వాల్ ను చూసి సిగ్గు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్. ఈ మాటలు మేమంటున్నవి కాదు స్వయంగా పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు. తనకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడం మోహమాటమని, కానీ నిధి అగర్వాల్ హరి హర వీరుమల్లు చిత్ర ప్రమోషన్స్ ను భుజాన మోస్తుంది.
నిధి ని చూసి సిగ్గు తెచ్చుకున్నాను. అందుకే నిన్న (సోమవారం) ఉదయం వీరమల్లు ప్రెస్ మీట్ కి వచ్చాను, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాను, రేపు వస్తాను, ఎల్లుండి మీడియా ముందుకు వచ్చి హరి హర వీరమల్లు ని ప్రమోట్ చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ను చూసి సిగ్గు తెచ్చుకున్నాను అంటూ మాట్లాడడం అందరికి నవ్వు తెప్పించింది.
మాములుగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలకు ఆయన కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్ప మరో ప్రమోషనల్ ఈవెంట్ లో కనిపించరు. ఓ ఇంటర్వ్యూలో కానీ, లేదంటే ప్రెస్ మీట్లో కానీ కనిపించరు. ఇప్పుడు వీరమల్లు ప్రమోషన్స్ విషయంలోనూ అదే అనుకున్నారు. కానీ నిధి ని చూసి పవన్ మారారు అంటే నిజంగా నమ్మశక్యంగా లేదు.