జులై 24 న విడుదల కాబోతున్న హరి హర వీరమల్లు చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు వచ్చేసాయి. ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి వీరమల్లు రేట్లు ఎక్కువగా పెరిగాయని, తెలంగాణ లో రేవంత్ సర్కార్ పెంచుతుందో లేదో అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా హరి హార వీరమల్లు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది.
అంతేకాదు ఈ నెల 23న ప్రీమియర్ షోకు తెలంగాణ సర్కార్ అనుమతి. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. అలాగే తెలంగాణలోని మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.200 వరకు పెంపు. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150 వరకు పెంచుకోమని రేవంత్ రెడ్డి సర్కార్ జీవో జారీ చేసింది.
సో ఏపీలోనే కాదు హరి హర వీరమల్లు కు తెలంగాణ లోను బాగానే వర్కౌట్ అయ్యింది.