యానిమల్ చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్ గా మారిన త్రిప్తి డిమ్రి ఇప్పుడు స్పిరిట్ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపికై మరింత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారింది. కారణం దీపికా పదుకోన్ స్థానంలోకి సందీప్ వంగ త్రిప్తి డిమ్రిని తీసుకోవడంతో ఆమె పేరు మార్మోగిపోయింది.
తాజాగా త్రిప్తి డిమ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు ప్రతి జానర్ అంటే లవ్ అండ్ కామెడీ చిత్రాల్లో నటించాను, కానీ ఇప్పటివరకు టచ్ చెయ్యని జానర్ మాత్రం యాక్షన్. నాకు యాక్షన్ రోల్స్ చెయ్యడం అంటే ఇష్టం. నా దగ్గరకు ఎప్పుడు యాక్షన్ స్టోరీస్ రాలేదు, వస్తే మాత్రం వదులుకోను. ఫ్యూచర్ లో యాక్షన్ వైపు అడుగులు వేస్తాను.
ఇప్పుడు అలాంటి పాత్రలతో సంబంధం లేకుండా నటీనటులు నటించేస్తున్నారు. నేను కూడా నెగెటివ్ పాత్రల్లో నటిస్తాను. ఒకప్పుడు నెగెటివ్ అంటే విలన్ రోల్స్ అనే వారు. కానీ ఇప్పుడు అలాంటి పాత్రలను ఎవ్వరైనా పోషించవచ్చు. అలాంటి పాత్రలు ఛాలెంజింగ్ రోల్స్ అనే చెప్పాలి. కొత్తగా నేర్చుకోవడానికి ఇష్టపడతాను అంటూ త్రిప్తి డిమ్రి చెప్పుకొచ్చింది.