రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ పై ఈడీ కొరడా జులిపిస్తుంది. ఈ కేసులో సెలబ్రిటీస్ కు నోటీసులు ఇవ్వడమే కాదు విచారణను ఈడీ అధికారులు ముమ్మరం చేశారు.
ఈ కేసులో ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు రానా ని జూలై 23న, ప్రకాష్ రాజ్ ని జూలై 30న ఈడీ అధికారులు విచారించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని ఈడీ ఆదేశించింది.
మరి ఈడీ నోటీసులు కు ఇప్పటికే కొంతమంది నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెర్స్ విచారణకు హాజరు కాగా.. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రానా, లక్ష్మి మంచు, ప్రకాష్ రాజ్ లు విచారణకు హాజరవుతారా, లేదో అనే విషయంలో క్యూరియాసిటీ మొదలైంది.