లేటు వయసులోను ఘాటు ఫోజులతో సంచలనం సృష్టించడం ఎలానో మలైకా అరోరాకు తెలిసినంతగా ఇతరులకు తెలీదేమో. సోషల్ మీడియాల్లో ఈ 50 ప్లస్ భామ వరుస ఫోటోషూట్లు వైరల్ గా షేర్ అవుతున్నాయి. తాజాగా టస్కానీ టూర్ నుంచి మలైకా ఇన్ స్టా మాధ్యమంలో షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతోంది.
మలైకా పింక్ బికినీలో గుబులు రేపే ఫోజులతో చెలరేగిపోయింది. సముద్ర వాతావరణం.. అల్ట్రా లగ్జరియస్ బీచ్ రిసార్ట్ పరిసరాల్లో మలైకా స్పెషల్ ఫోటోషూట్ యువతరం మనసులను గెలుచుకుంటోంది. ఈసారి టూర్ లో తనయుడు అర్హాన్ కూడా ఉన్నాడు. అయితే మలైకా మాత్రం పూర్తిగా బికినీ షూట్లకే సమయం అంకితమిచ్చింది.
బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ప్రతి ఫోటోషూట్ వెబ్ ని షేక్ చేస్తున్నాయి. హిందీ టీవీ చానెళ్లలో డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగా లక్షల్లో ఆర్జిస్తున్న మలైకా కాస్ట్ లీ లైఫ్ స్టైల్ ఎల్లపుడూ చర్చనీయాంశం. త్వరలోనే కుమారుడు అర్హాన్ ఖాన్ ని హీరోని చేయాలని ఈ యాభై ఏళ్ల మామ్ ఉవ్విళ్లూరుతున్నట్టు కథనాలొస్తున్నాయి.