రిషబ్ శెట్టి హీరో గా ఆయన దర్శకత్వంలో అక్టోబర్ 2 టార్గెట్ గా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ 1 చిత్రం షూటింగ్ స్పాట్ లో చిత్ర బృందంలోని కొంతమంది అనుకోకుండా మరణించడం, అలాగే షూటింగ్ వాయిదాలతో అక్టోబర్ 2 న కాంతార 1 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండదనే ప్రచారం ఎంతగా జరిగినా మేకర్స్ ఎప్పటికప్పుడు దానికి చెక్ పెడుతూనే ఉన్నారు.
తాజాగా ఆ రూమర్స్ కు మరోమారు రిషబ్ శెట్టి చెక్ పెడుతూ కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 షూటింగ్ అయిపోయింది అంటూ అధికారిక మేకింగ్ వీడియోతో ప్రకటించేశారు. కాంతార మూవీ మేకింగ్ వీడియో చూస్తే దిమ్మతిరగడం ఖాయం. కాంతార1 మూవీ మేకింగ్ వీడియో చూస్తే ఈ చిత్రం విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం గ్యారెంటీ.
మరి కాంతార చిత్రంతో కన్నడ లోనే కాదు పాన్ ఇండియాలో విడుదలైన ప్రతి భాషలోనూ ఎలాంటి అంచనాలు లేకుండానే భారీ హిట్ అవడంతో.. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉండడమే కాదు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని భాషలకు కలిపి ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగానే బిజినెస్ జరిగేలా ఉంది.