ధమాకా తర్వాత ఇప్పటివరకు శ్రీలీల ఖాతాలో అద్భుతమైన హిట్ పడలేదు సరికదా.. ఆమె నటించిన సినిమాలన్నీ ఒకేమాదిరి స్రిప్ట్స్. అంటే శ్రీలీల ను రిచ్ గర్ల్ గా నాలుగు పాటలకు, నాలుగు సీన్స్ కి పరిమితం చేసే మాదిరి పాత్రలు. వరసబెట్టి శ్రీలీల చేసిన సినిమాలన్నీ అదే మాదిరిగా ఉండడం, వరసగా ఆమె ఖాతాలో డిజాస్టర్స్ పడడం చూసాం.
గుంటూరు కారం ఓ మాదిరి హిట్టు, కానీ శ్రీలీల కు ఎలాంటి క్రెడిట్ రాలేదు. పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ తో ఒక్కసారిగా రేజింగ్ లోకి వచ్చిన శ్రీలీల హిందీలోనూ జెండా పాతేందుకు రెడీ అయ్యింది. ఈలోపు అమ్మడు ఓ రిచ్ వారసుడి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అది కూడా భారీ పారితోషికానికి.
పారితోషికం చూసుకున్న శ్రీలీల.. కథ అందులోని తన పాత్రను పట్టించుకున్నట్టుగా లేదు. అదే గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా తెరకెక్కిన జూనియర్ లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా విడుదలైన జూనియర్ కి వచ్చిన టాక్ పక్కనపెడితే ఆ చిత్రంలో శ్రీలీల కేవలం పాటలకే పరిమితమైంది.
సెకండ్ హాఫ్ లో వయ్యారి సాంగ్ లో తప్ప శ్రీలీల మరెక్కడా కనిపించలేదు అంటే నమ్మాలి. వయ్యారి సాంగ్ లో శ్రీలీల డాన్స్, ఆమె గ్లామర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నా ఎలాంటి స్కోప్ లేని కేరెక్టర్ లో ఆమె కనిపించినందుకు ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
జూనియర్ చిత్రానికి వస్తున్నా టాక్, రివ్యూస్ చూసాక భారీ పారితోషికానికి పడిపోయి డిజాస్టర్ ని కొనితెచ్చుకున్న శ్రీలీల అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.