మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ విశ్వంభర విడుదల తేదీ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అనేది ఎవరూ చెప్పక్కర్లేదు. జనవరి నుంచి మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా విశ్వంభర రిలీజ్ తేదీ కోసం పడిగాపులు కాస్తున్నారు. కానీ విశ్వంభర టీజర్ కొచ్చిన ఫీడ్ బ్యాక్ తో దర్శకుడు వసిష్ఠ మీడియా కు ముఖం చాటేసాడు.
విశ్వంభర గ్రాఫిక్ వర్క్ పూర్తి కాని కారణంగా విశ్వంభర విడుదల తేదీ ఇవ్వలేకపోతున్నారనే వార్తల నేపథ్యంలో దర్శకుడు వసిష్ఠ సడన్ గా మీడియా కి ఇంటర్వ్యూలు ఇస్తూ విశ్వంభర చిత్ర స్టోరీ లైన్ రివీల్ చేస్తూ, మెగాస్టార్ రోల్ పై హైప్ క్రియేట్ చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇవ్వడం వలన మెగా అభిమానులు శాంతిస్తారా..
కాదు ముందు విశ్వంభర విడుదల తేదీ ఇచ్చి ఆ తర్వాత ఇలాంటి ఇంటర్వూస్ ఇస్తే సినిమాపై క్రేజ్ పెరుగుతుంది. కానీ విశ్వంభర రిలీజ్ తేదీ ని పెండింగ్ లో పెట్టి అలా ప్రమోషన్స్ అంటూ మీడియా ముందు మాట్లాడంపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విశ్వంభర విడుదల అనే ప్రచారానికి వసిష్ఠ ఎప్పుడు చెక్ పెడతారో చూడాలి.