మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం గత నెల అంటే జూన్ 27 న పాన్ ఇండియా మూవీ గా థియేటర్స్ లో విడుదలైంది. డివోషనల్ మూవీగా భారీ తారాగణంతో తెరకెక్కిన కన్నప్ప చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ విమర్శలు ఎదుర్కున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర కేరెక్టర్ ఆడియన్స్ కు కనెక్ట్ అవడంతో కన్నప్ప సినినిమా థియేటర్స్ లో సూపర్ హిట్ కాకపోయినా హిట్ చిత్రంగా నిలిచింది. కన్నప్ప టీమ్ ఈచిత్ర కలెక్షన్స్ పోస్టర్స్ కూడా రివీల్ చెయ్యలేదు అయితే మంచు విష్ణు కి లెక్కలతో పని లేదు కష్టపడినందుకు పేరొచ్చింది చాలు అని నెటిజెన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు.
జూన్ 27 న థియేటర్స్ లో విడుదలైన కన్నప్ప ఓటీటీ రాక కన్ ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. కన్నప్ప చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ డిజిటల్ హక్కులను దక్కించుకోగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూలై 25 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.