హరి హర వీరమల్లు చిత్రం విడుదలకు ముందు దర్శకుడు క్రిష్ మౌనం చూసి.. జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాతగా దర్శకుడు క్రిష్ హరి హర వీరమల్లు అంటూ పిరియాడికల్ డ్రామా ను మొదలు పెట్టారు. ఆ సినిమా షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. 70 శాతం షూటింగ్ పూర్తయ్యాక క్రిష్ వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
పవన్ కళ్యాణ్ సరిగ్గా షూటింగ్ కి హాజరు కాకపోవడంతోనే సమయం వెచ్చించలేక క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్టు లోకి ఎంటర్ అయ్యారని అన్నారు. మరి అదే నిజమైతే వీరమల్లు షూటింగ్ దాదాపుగా 70 శాతం పూర్తి చేసిన క్రిష్ ఈ సినిమా విషయంలో మేజర్ క్రెడిట్ దక్కుతుంది.
అందుకు తగ్గట్టుగా ఆయన కూడా హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో కనిపించాలి. కానీ దర్శకుడు క్రిష్ హరి హర వీరమల్లు ప్రమోషన్స్ లో కానరావడం మానేసి కనీసం సోషల్ మీడియాలో కూడా వీరమల్లు పై ట్వీట్ కూడా వెయ్యకుండా కామ్ గా ఉంటున్నారు. అది చూసిన వాళ్ళు క్రిష్.. వీరమల్లుపై ఎందుకీ మౌనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.